Sunday, April 10, 2016

సాంప్రదాయలు

1.    ముక్కులు కుట్టిన్చుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము. చెవులు కుట్టించుకున్న హృదయ సంబంద రోగములు రావు.
2.    ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవాత్మ అనియు రెండు ఏకము కావలెనను ఉద్దేశముతో రెండు చేతులు కలిపి నమస్కరించుచున్నాము.
3.    తడి పాదములతో బోజనము చేసిన ఆయుర్వుద్ధి , తడి పాదములతో శయనించిన ఆయుక్షీణం.
స్త్రీలకు బేసి సంఖ్యా గల అక్షరములతో, పురుషులకు సరి సంఖ్యా గల అక్షారములతో పేర్లు పెట్టుట మంచిది.
4.    సూర్య గ్రహణానికి ముందు ”12 ” గంటల కాలము, చంద్ర గ్రహణానికి ”9” గంటల ముందు కాలము కడుపు కాలిగా ఉంచుకోవలెను.
5.    శిశువు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటె స్థానం వారి జన్మ రాశి మరియు పుట్టిన సమయమునకు సూర్యుడు రాశిలో ఉంటె అది వారి జన్మ లగ్నం.
6.    జ్యోతిశాస్త్రం ప్రకారం బంగారం కుజునికి , వెండి గురువునకు , రాగి రవికి ,ఇత్తడి భుదునకు, ఇనుము శని కి ఇష్టము.
7.    రుద్రాక్ష ఎంత పెద్దదైతే అంత మంచిది, సాలగ్రామం ఎంత చిన్నదైతే అంత మంచిది.
8.    బుదవారం నాడు బూడిద గుమ్మడి కాయను, గురువారం నాడు కొబ్బరి కాయను వ్రేలాడ కట్టుకుంటే నరఘోశాలు తొలుగుతాయి.
9.    యాత్ర సమయములందు మార్గ మధ్యమున పరుండు నపుడు పాదరక్షలను తలక్రింద ప్ర్ట్టుకొని పరున్నచో మృత్యుభయం తొలగి సులభ మార్గమధ్య మేర్పడును.
10.  ఎవరికైనా వస్త్రములను ఇవ్వదలచినపుడు(వస్త్ర యుగ్మం) రెండు వస్త్రాలను ఇవ్వవలెను. తాంబూలం ఇచ్చేటపుడు తమలపాకు, అరటిపండు తొడిమలను ఇచ్చేవారి వైపు కొసలు తాంబూలం పుచ్చుకునే వారివైపు ఉండాలి.
11.  ఇరువురు వ్యక్తులు ఎదురెదురుగా కుర్చునప్పుడు దక్షిణ ముఖం అను ఆక్షేపణ రాదు. అలాగే హోమం చేయునపుడు -రుద్రునకు అభిషేకం చేయునపుడు నాలుగు వైపులందు నలుగురు కుర్చుండిన దిశల ఆక్షేపణలు ఉండవు.
12.  ఇద్దరు ఆడపిల్లలకు ఒకేమారు వివాహం చేయవచ్చును, కాని ఇద్దరు మగపిల్లలకు ఒకేసారి వివాహం చేయకూడదు. కనీసం ఆరు మాసాలు తేడా ఉండాలి.
13.  గృహ ప్రవేశ సమయములందు మంచి గుమ్మడికాయను పగలకోట్టుచుండురు. అది కేవలం పురుషులు మాత్రమే చేయవలెను. ఎత్తి పరిస్తుతులోను స్త్రీలు చేయరాదు.
14.  వినాయకునికి తులసి దలంతోను- శివునకు మొగలిపువ్వుతోను- దుర్గ ను గరిక తోను పూజించరాదు.
15.  తులసి దళమును-బిల్వ దళమును ఒకసారి పూజ చేసిన తర్వాత కడిగి మరల మరొకసారి పూజించవచ్చును.
16.  బోజనం చేసిన తర్వాత ఎడమ వైపు తిరిగి పడుకొని, కుడివైపు తిరిగి లేవవలెను

No comments:

Post a Comment