Monday, February 2, 2015

అన్నప్రాశనం ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి అని చెప్తున్నాడు



అన్నప్రాశనమర్భకశ్చ శుభగం మాస్యేవ యుగ్మే శుభే!” కాలామృత కారులు అన్నప్రాశనం ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి అని చెప్తున్నాడు. అలాగే ఎవరిచేత తినిపించాలి అనేది కూడా సంప్రదాయం చెప్తుంది. ఎవరిచేత తినిపించాలి అనేది ధర్మంలో లేదు.
అన్నప్రాశనమర్భకశ్చ శుభగం మాస్యేవ యుగ్మే శుభే!”
షష్ఠాదామధవంచపాధిదివసే మాసే వధూనాం గృహే!! అంటుంది ధర్మం. 
అయిదవ నెల ఐదవరోజు అంటే ఆరవనెలలో మొదటి ఐదవరోజు అమ్మాయి పుట్టింట్లో దేవతారాధన ఇంట్లో పూర్తి చేసి ఇష్టదేవతకు ప్రీతికరంగా నైవేద్యం సిద్ధం చేయాలి. అది ఏమిటి అంటే “దధి ఘృత మధు ఓదనం” – దధి – పెరుగు; మధు – తేనె; ఘృతం – నెయ్యి; ఓదనం – అన్నం. ఈ నాలుగింటినీ కూడా తగిన పాళ్ళలో మేళవించి ముద్ద చేసుకోవాలి. నైవేద్యంగా సమర్పించి ఆ పదార్ధమును వెండి పళ్ళెంలో పెట్టుకొని బంగారు చెంచాతో కానీ, ఉంగరంతో కానీ తీసి ముందుగా శిశువు తండ్రి/తాతగారు – తండ్రి చేయాలి ధర్మం. ఎందుకంటే ఏది చేసినా యజమాని తానె అవుతున్నాడు. “ఆత్మావై పుత్రనామాసి” వంటి మంత్రాలు చెప్పి “అన్నవాన్ భవ” “అమృతవాన్ భవ” అని చెప్పాలి. అన్నప్రాసన సమయంలో పెట్టే ఈ మొట్టమొదటి ముద్ద తండ్రి చేయాలి. అలవాటులో సంప్రదాయంలో మేనమామ తినిపించడం ఆచారంగా కూడా ఉంది. ఎందుకు చేయాలి అయిదవనెల అయిదవ రోజు అంటే “గర్భస్థ” – గర్భంలో ఉన్నప్పుడు; “అంబుపాన దోష పరిహారార్థం” అని సంకల్పం. పిండరూపంలో కడుపులో ఉన్నప్పుడు అనేకపదార్థములను తిని ఉంటుంది. వాటికి సంబంధించిన సకల దోషములూ కూడా తొలగిపోవాలి అంటే ఇటువంటి మంత్రపూతమైనటువంటి అన్నమును తినిపిస్తే ఆ దోషం పోతుంది. ఇది మెడిసిన్. సంస్కృతిలో సంప్రదాయంలో మన ఆచారాలన్నీ ఇలా ఆరోగ్య రహస్యాలతో, ఆధునిక శాస్త్ర రహస్యాలతో మేళవింపబడి ఉన్నాయి. పరిశోధిస్తే తెలుస్తాయి. కనుక ఎక్కడ? – అమ్మాయి యింట్లో; ఎవరు? – తండ్రి; ఎప్పుడు? – అయిదవనెల ఐదవరోజు; ఏమిటి?- దధి మధు ఘృతఓదనం.